తెలంగాణ రాష్ట్ర౦లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇక గ్రామాల్లో బ్యాటరీ రిక్షాతో చెత్త సేకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో 11బ్యాటరీ రిక్షాలతో చెత్త సేకరణ చేసేందుకు గ్రామ పంచాయతీలు ముందుకు రాగా, శనివారం రిక్షాలు గ్రామాలకు చేరాయి. చెత్త సేకరణలో గ్రామాల్లో నిత్యం ఆటోలు, ట్రాక్టర్లు, ట్రైసైకిళ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట మున్సిపాల్టీలో చెత్త సేకరణకు బ్యాటరీ రిక్షాలను వినియోగిస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకోని బ్యాటరీ రిక్షాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు . ఈ క్రమంలో సిరిసిల్ల మండలంలోని ముష్టిపల్లి, రగుడుతోపాటు తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి, మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన రామన్నపల్లె, బద్దెనపల్లి, గండిలచ్చపేట, జిల్లెల్ల, మండెపల్లి, నేరెళ్ల, తాడూరు, చీర్లవంచ గ్రామాల సర్పంచులు బ్యాటరీ రిక్షాలు తీసుకునేందుకు ముందుకువచ్చారు. ఈ బ్యాటరీ రిక్షాలను ముష్టిపల్లి, రామన్నపల్లె సర్పంచులు బాలయ్యగౌడ్, రాజేశ్వరి కొనుగోలు చేసి గ్రామపంచాయతీలకు తీసుకువచ్చారు. బ్యాటరీ రిక్షాకు ఏడు గంటల చార్జీంగ్ చేస్తే 90కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చనీ, దీనికి అన్ని సరఫరా ఖర్చులతో రూ.1.43లక్షలు అయ్యిందని సర్పంచులు వెల్లడించారు.
Piloting these environment friendly electric vehicles in ten villages of my constituency for transporting waste. Eventually want to scale up pic.twitter.com/PjxwZmlGFH
— KTR (@KTRTRS) October 30, 2017