తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రె్‌సలో చేరనున్నారు. అయితే, అంతకు ముందు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కాంగ్రె్‌సలో చేరే పలువురు ముఖ్యులతో కలిసి రాహుల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి తనవెంట పార్టీలోకి వస్తున్నవారిని రాహుల్‌కు రేవంత్ పరిచయం చేస్తారు. కాగా, దాదాపు 50మంది ఢిల్లీకి చేరుతున్నా రాహుల్ గాంధీ మాత్రం 15 మంది వరకు మాత్రమే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేలా పార్టీ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ వెంట వచ్చే వాళ్లు బస చేయడానికి కర్నాటక భవన్లో 30 గదులు బుక్ చేసిన సంగతి తెలిసిందే.
