2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆండగా జగన్ అభిమానులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు.
ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేందుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇక ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతం కావాలని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి సోమవారం తాను తిరుమల నుంచి తిరుత్తణి వరకు కాలినడకన వెళ్లనున్నసంగతి తెలిసిందే