సినిమాల్లో అవకాశాలంటూ హీరోయిన్లకు ఎదురయ్యే వేధింపుల గురించి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. కొద్ది రోజుల నుండి హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతూ హీరోయిన్లు సంచలనం రేపుతున్నారు. ఇలా సెలబ్రటీలు సినీ ఇండస్ట్రీ ఫై రకరకాల వాక్యాలు చేయడం కామన్. ఇక హీరోయిన్స్ అయితే ఎక్కువగా లైగింక వేధింపుల గురించే మాట్లాడుతుంటారు.
హీరో దగ్గరి నుండి మొదలు పెడితే దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ కూడా హీరోయిన్లను బెడ్ రూమ్ కు రావాల్సిందే అని ఒత్తిడి తెస్తారని మాట్లాడుతుంటారు. ఆ మధ్య బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఇలాంటి కామెంట్స్ మీడియా ఎదురుగా చెప్పి సంచలనం సృష్టించింది.ఈ జాబితాలో మరో సీనియర్ నటీమణి కూడా చేరింది.
అయితే లేటెస్ట్‌గా ఇప్పుడు హాట్ భామ విద్యా బాలన్ కూడా ఇలాంటి వాటిని ఎదురు కోవాల్సి వచ్చిందని చెప్పి హాట్ టాపిక్ అయ్యింది.ఇండస్ట్రీలో తనపైనా కూడా ఒత్తిళ్లు తప్పలేదని విద్య పరోక్షంగా తేల్చి చెప్పింది. అయితే వాటిని తిప్పి కొట్టానని, వాటి బారిన పడకుండా తన జీవితాన్ని తాను కాపాడుకున్నానని విద్య వివరించింది. తన మధ్యతరగతి మనస్తత్వమే అందుకు ఉపయోగపడ్డాయని విద్య వివరించింది.