తెలంగాణ రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తుమ్మల మాట్లాడారు… ఎన్‌హెచ్ వెళ్లే ముఖ్య పట్టణాల్లో వలయాకారంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో జాతీయరహదారికి రూ.96కోట్లు మంజూరు చేశామని, డీపీఆర్ పూర్తి కాగానే భూసేకరణ జరుగుతుందన్నారు. వరంగల్‌లో రూ.600 కోట్లతో 69 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో జాతీయ రహదారులకు సంబంధించి టెండర్లు పిలిచామన్నారు. రహదారులకు ఒక వైపే భూసేకరణ చేపట్టాలని కేంద్రం ఆదేశించిందని, రహదారికి ఒకవైపు ఉన్న చెట్లను పరిరక్షించాలని కేంద్రం సూచించిందన్నారు
Post Views: 239