సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న 2.0 చిత్రం హంగామా మాములుగా లేదు. దుబాయ్ లో ఆడియో లాంచ్, హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఇలా నానా హంగామా చేస్తూ వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని సూపర్ స్టార్ రజిని అభిమానులతోపాటు… యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అయితే నిన్నటినుండి సోషల్ మీడియాలో 2.0 సినిమా జనవరి లో రావడంలేదని… వేసవికి వాయిదా పడిందనే న్యూస్ హల్చల్ చేస్తుంది.
గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానీ కారణంగా 2.0 సినిమాని జనవరి లో విడుదల చెయ్యడం లేదంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు మాత్రం ఈ సినిమాని ఎప్పటిపరిస్తితుల్లో జనవారికే అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వారు కూడా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వేసవికే మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడం సూపర్ స్టార్ అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవడానికి మరో కారణం ఉందట. అదేమిటంటే 2.0 విలన్ అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ సినిమా విడుదల జనవరి నెలాఖరున ఉండడంతో 2.0 సినిమాని వాయిదా వేశారనే టాక్ వినబడుతుంది.
ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని శంకర్ గత రెండేళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు. ఇక ఈ సినిమా జనవరి నుండి ఏప్రిల్ 13 కి షిఫ్ట్ అయ్యిందని… 2.0 నిర్మాతలు కూడా ఏప్రల్ 13 కే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరి ఇప్పటికే ఏప్రిల్ లో చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాలకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. మరి ఇప్పుడు అదే టైం లో 2.0 గనక బరిలో దిగితే ఆయా హీరోలందరికీ చమటలు పట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.