హాలీవుడ్‌లో ఇటీవల సంచలనం రేపిన నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. తనలాంటి చాలా మంది మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తాలని మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఇచ్చిన పిలుపునకు అన్ని దేశాల నుంచి స్పందన వస్తోంది.
ఇప్పటికే.. ఎంతో మంది ఆమెతో గొంతుకలుపుతూ తమ ఆవేదనను # Metoo అంటూ అందరి ముందూ ఉంచుతున్నారు. ఈ నేపధ్యంలో హీరోయిన్ రాశీఖన్నా స్పందించింది. సోషల్‌మీడియాలో # Metoo కు వస్తున్న స్పందనను చూసి.. వేధింపులు ఒక్క ఆడవాళ్లకే కాదని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారిలో పురుషులు కూడా ఉన్నారని ఇదే విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.