టాలీవుడ్ ఎనర్జిటిక్ రామ్ తన కెరీర్ లోనే కూల్ అండ్ కామ్‌గా కనిపించే పాత్రలో నటించిన నేను శైలజ చిత్రాన్ని తిరుమల కిషోర్ దర్శకత్వ వహించారు. ఇక ఆ చిత్రం డీసెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు అలవాటయిన స్టయిల్లో హైపర్ చేసినా రొటీన్ కంటెంటే కావడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో కొంత టైం గ్యాప్ తీసుకుని మరోసారి తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగీ మూవీ చేశాడు. ఇందులో రామ్ పాత్రకు.. నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.
ఉన్నది ఒకటే జిందగీ ప్రేమకథ కావడంతో తరవాత సినిమా కొత్త తరహా ఎంటర్ టెయినర్‌గా ఉండాలని రామ్ అనుకుంటున్నాడట. నాచురల్ స్టార్ నానితో నేను లోకల్ సినిమా తీసి హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావుతో కలిసి నెక్స్ట్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. నక్కిన త్రినాథరావు చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో పాటు క్యారెక్టర్ ను వివరించిన తీరుకు రామ్ బాగా ఇంప్రెస్ అయ్యాడనేది అతడి సన్నిహితుల మాట. ఇందులో రామ్ క్యారెక్టర్ కొత్త తరహాలో ఉండటంతో పాటు బాగా హైలైట్ అవుతుందని అంటున్నారు.
సాధారణ స్టోరీని హీరో బాడీ లాంగ్వేజ్ కు తగినట్లుగా ఎంటర్ టెయినింగ్ గా చెప్పడం నక్కిన త్రినాథరావు స్పెషాలిటీ. నేను లోకల్ కూడా కథాంశం రొటీనే అయినప్పటికీ నాని యాక్టింగ్ సినిమాకు బాగా బలంగా నిలిచింది. ఇప్పుడు రామ్ సినిమా చేసేందుకు రెడీ అవడంతో అతడి బాడీ లాంగ్వేజికి తగ్గట్టు స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో నక్కిన త్రినాథరావు బిజీ అయ్యాడు. అన్నీ అనుకూలిస్తే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టే అవకాశముందని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నాఉ.