అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మళయాళంలో ఈ అమ్మడు చేసిన ప్రేమమ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెలుగులో రేమీక్ అయిన ప్రేమమ్ సినిమాలోనూ అనుపమ ఛాన్స్ దక్కించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేగాక, తెలుగులో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిందామే. ఆ సినిమాలో హీరో శర్వానంద్‌తో అనుపమ పరమేశ్వర్ ఆన్‌స్ర్కీన్ కెమిస్ర్టీ చక్కగా కుదిరింది. ఆస్ర్టేలియా నుంచి ఇక్కడి పల్లెటూరి యువకుడి ప్రేమించిన అమ్మాయిగా అద్భుతంగా నటించింది.
ఇటీవలె అనుపమ పరమేశ్వరన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆట్లాడుతూ.. శర్వానంద్ తనకు టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. శర్వాతో తనకు చక్కటి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చింది. ఉన్నది ఒక్కటే జిందగీ అంటూ రామ్‌తో కలిసి ఈ మధ్యనే మళ్లీ ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ఈ బ్యూటీ శర్వాతో తన స్నేహం గురించి మాట్లాడింది. ఉన్నది ఒక్కటే జిందగీలోనూ రామ్, అనుపమ మధ్య వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలనూ చెప్పుకొచ్చింది ఈ మళయాళ బ్యూటీ.. తనకు చదువుకునే రోజుల్లో.. అంటే స్కూల్ ఏజ్‌లోనే క్రష్ ఉండేదని, ఆ అబ్బాయి అంటే విపరీతమైన ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే, ప్రస్తుతం మాత్రం ఎవ్వరూ లేరని, ఎవ్వరూ కంగారు పడవద్దని చెప్పుకొచ్చింది ఈ మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్.