Home / MOVIES / పూరీ టేకింగ్.. కొడుకును నిల‌బెట్టేనా..?

పూరీ టేకింగ్.. కొడుకును నిల‌బెట్టేనా..?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా దర్శకుడుగా తడబడుతున్న సంగతి తెలిసిందే. పూరీ తీస్తున్న వ‌రుస చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ‌క్కెట్ త‌న్నేస్తున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలను చేసినా.. తన కలం బలంతో ఒక్కో హీరో క్యారెక్టర్ ని తనదైన శైలిలో చూపించి ఇండస్ట్రీ రికార్డులను తీరగరాశాడు. పూరీతో ఒకప్పుడు సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. సో.. ఇప్పుడు మళ్లీ తన వాడి వేడిని చూపించి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

పూరీ తాజాగా తన కొడుకు ఆకాష్‌తో మెహబూబా అనే సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ను పూరి తన రెగ్యులర్ ఫార్మాట్ కి బిన్నంగా తెరకెక్కిస్తున్నాడట. పూరి జగన్నాథ్ లవ్ రొమాంటిక్ సినిమాలను తీసి చాలా కాలమే అయ్యింది. అందుకే ఆడియన్స్ కూడా మనోడు ప్యూర్ లవ్ స్టోరీ తీస్తాడా లేదంటే పంచులతో కూడిన రొటీన్ స్టోరీ తీస్తాడా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఆ ఫార్మాట్ తో పాటు కొంచెం సస్పెన్స్‌ని కూడా జోడించి కథను ఆసక్తిగా తెరకెక్కిస్తున్నాడట. చిత్ర యూనిట్ కూడా పూరీ టేకింగ్‌ను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. మరి ఈ చిత్రంతో అయినా ఆడియ‌న్స్‌ని పూరీ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలని సినీ వ‌ర్గీయులు చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat