విలక్షణ పాత్రలు పోషిస్తు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ నిత్యమీనన్. మళయాళంలోనే కాక తెలుగు, తమిళ భాషల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. భిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకొని, ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంటున్నది ఈ భామ. కాంచన-2 నుంచి మెర్సల్ వరకు వేటికవే ప్రత్యేకమైన పాత్రల్లో నటించి మెప్పించింది . 24 లో గృహిణిగా, ఇరుముగన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, తాజాగా మెర్సల్లో పంజాబీ అమ్మాయిగా, భార్యగా, బిడ్డను పోగొట్టుకుని బాధపడే తల్లిగా భావోద్వేగ పాత్రలో నటించి ప్రశంసలందుకుంది.
ఇక మెర్సల్ అమోఘ విజయం సాధించిన నేపథ్యంలో నిత్య మీడియాతో మాట్లాడుతూ..పలు ఆసక్తికర విషయాలు చెప్పింది .నా కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన సినిమాల్లో నటిస్తున్నాను. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తాను. నిజానికి ‘మెర్సల్’ కంటే ముందు రాజారాణి, తెరి చిత్రాల్లోనే అట్లీతో పనిచేయాల్సి ఉంది. ఈ సినిమాతో కుదిరింది. ఇంకో విషయం ఏమిటంటే… దర్శకులందరూ నా పాత్రల్ని చంపాలనే కోరుకుంటున్నారు .. ఒక మంచి పాత్ర మరణిస్తే సెంటిమెంట్ ఎక్కువగా పండుతుంది. అది వారి దృష్టి. మంచి పేరు తెచ్చే పాత్రలు చేయడం నాకూ ఇష్టమే అని తెలిపింది .