Home / SLIDER / ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం..

ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మధ్యాహ్నం గుండెపోటు రావడంతో నగరంలో ఒక ప్రధాన ఆస్పత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

1988 నుంచి 1999 మధ్య కాలంలో వరకూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 2013లో భారత జట్టుకు శ్రీధర్ మేనేజర్ గా సేవలందించారు. ఒక మంచి క్రికెటర్ గా, మంచి వ్యక్తిగా పేరున్న శ్రీధర్ ఆకస్మిక మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీధర్ మృతదేహాన్ని నగరంలోని జూబ్లిహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు.

97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat