సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం. అయితే కొన్ని వెలుగులోకి వస్తాయి. కొన్ని చాటుమాటుగా జరుగుతుంటాయి. జనరల్‌గా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే హీరో నితిన్‌తో మేఘ ఆకాష్‌కు లింకు పెడుతూ కోద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే ఈ గాసిప్ చాలా రోజుల నుండి వైరల్ అవుతున్న మేఘ, నితిన్‌లు ఎవరూ స్పందిచలేదు. అయితే తాజాగా.. నితిన్‌ను తాను ప్రేమించడం లేదని నటి మేఘా స్పష్టం చేస్తూ రూమర్లకు చెక్ పెట్టింది. నితిన్‌తో కలిసి ఆమె లై చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నితిన్‌తో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు.
అయితే వీరి మధ్య ప్రేమ ఉందని కొంతకాలంగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే నితిన్ చిత్రం కోసం మేఘా ఆకాశ్ డేట్లను సర్దుబాటు చేసుకుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె ఖండించింది. చిత్ర బృందం కోరికమేరకే తాను డేట్లు సర్దుబాటు చేసుకున్నట్టు తేల్చి చెప్పారు. అంతే తప్ప నితిన్‌తో తనకు ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం వాస్తవం కాదని తన అభిమానులు గ్రహిస్తే చాలని ఆమె పేర్కొన్నారు.