అందాల రాక్షసి చిత్రంతో తన ముద్దు మద్దు మాటలతోనూ.. నటనతోనూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లావణ్య త్రిపాఠి. చేసింది తక్కువ సినిమాలే. ప్రతి సినిమాకి తనకున్న ఫేమ్ పోగొట్టుకుంటూ వచ్చింది. శ్రీరస్తు శుభమస్తు.. భలే భలే మగాడివోయ్ చిత్రాలలో కొంచెం క్యూట్‌గా ఉన్న లావణ్య.. మిస్టర్ దగ్గరకు వచ్చేసరికి లావణ్య ఏంటి.. ఇలా వుందనుకున్నారు తెలుగు ప్రేక్షకులు.
ఇక తాజాగావచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో తన పేస్ ఎక్సప్రెషన్‌తో జనాలకి చిరాకు తెప్పించింది. ఈ సినిమాతో ఇక లావణ్య త్రిపాఠీ ఇన్నింగ్స్ ముగిసిపోయినట్లే అనుకుంటున్నారు. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో అనుపమ చేసిన సెటిల్ యాక్షన్ ముందు లావణ్య తేలిపోయినట్టు కనిపించింది.
ఇక దానికితోడు ముదిరిపోయినట్లున్న లావణ్య ఫేస్, దానికి భయంకరమైన మేకప్, ఆ డ్రెస్ సెన్స్.. అబ్బో.. ఆమెను చూసి జనాలు గొల్లు మంటున్నారు. అనుపమ పెర్ఫార్మెన్స్ ముందు, ఆమె ఎక్స్ ప్రషన్స్ ముందు, అనుపమ క్యారెక్టర్ ముందు లావణ్య అన్ని విధాలా తేలిపోయింది. సినిమాలో వచ్చే మందు కొట్టే సీన్ అయితే ప్రేక్షకులకి చిరాకు అనిపించాయి.
దానికి తోడు కొన్ని చోట్ల ఓవర్ మేకప్ తో కనిపించటం.. ఇలా చాలా అంశాలే వున్నాయి చెప్పుకోటానికి. సోగ్గాడే చిన్నినాయనా.. సినిమాతో తెలుగులో స్థిరపడదామనుకున్న ఏ ఈభామకు ఆతర్వాత వచ్చిన సినిమాల్ని వరసబెట్టి ప్లాప్స్ అవడంతో ప్రేక్షకులు కూడా ఈమెపై పూర్తి వ్యతిరేఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక లావణ్య త్రిపాఠీ స్టార్ హీరో సినిమాలకు పనికిరాదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒకేసారి అడుగుపెట్టినా, మిగిలిన యంగ్ హీరోయిన్ల కన్నా త్వరగా ఫేడవుట్ అయిపోయిందని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.