Home / MOVIES / లావణ్యకి మ‌రో షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మే..!

లావణ్యకి మ‌రో షాక్‌.. కోలుకోవ‌డం క‌ష్ట‌మే..!

లావణ్య త్రిపాఠి.. తెలుగులో న‌టించిన తొలి చిత్రం అందాల రాక్ష‌సి తోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఆ త‌ర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుద‌ల అయిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది.

అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవ‌ల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, రాధ, యుద్ధం శరణం సినిమాలు లావణ్యకు పెద్దగా పేరేమి తెచ్చిపెట్టలేదు. లావణ్య తాజాగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో లావ‌ణ్య న‌ట‌న‌.. ఫేస్ పై ప్రేక్ష‌కులు పెద‌వి విరుస్తున్నారు.

ఇక ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రంలో నటిస్తున్నప్పటికీ కెరీర్‌పై లావణ్యకు దిగులు పట్టుకుంది. ఇప్పుడు దీనికి తోడు పెద్ద కష్టమొచ్చి పడింది. ఓ సినిమా విషయంలో లావణ్యకి తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగులో వచ్చిన 100% లవ్‌ చిత్రాన్ని తమిళంలో 100% కాద‌ల్‌ రీమేక్‌ చేస్తున్నారు.

జి.వి. ప్రకాశ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్ షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు నిర్మాత. ఏమైందో తెలీదు కానీ సినిమా నుంచి లావణ్య తప్పుకుంది. లావణ్య అకస్మాత్తుగా తప్పుకోవడం వల్ల సినిమా షూటింగ్‌ను అప్పటికప్పుడు ఆపేయాల్సి వచ్చింది.

దీంతో నిర్మాతకు రూ.3 కోట్ల నష్టం వచ్చిందట. ఈ మొత్తాన్ని లావణ్యే భరించాలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయించి సమాచారం. రూ.3 కోట్ల జరిమానాను లావణ్య కట్టితీరాల్సిందేనని నిర్మాతల మండలి కచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై లావణ్య ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే 100% కాదల్‌లో హీరోయిన్‌గా అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలిని పాండేను ఎంపిక చేసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat