ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే .
ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో మూడు వేల కిలో మీటర్ల మేరకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు .ఈ క్రమంలోనే వైసీపీ పార్టీలోకి అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు నాదెండ్ల మనోహర్ వచ్చే నెల నాలుగో తారీఖున వైసీపీలో చేరతాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .ఈ విషయం మరిచిపోకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేశారు .
ఈ క్రమంలో రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అమాలాపురం పార్లమెంట్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి నిలిచి ఓడిన హర్షకుమార్ త్వరలోనే వైసీపీ గూటికి రానున్నారు అని వార్తలు వస్తోన్నాయి .దీనికి తగ్గట్లు వచ్చే నెలలో అమాలాపురం లో ఎస్సీ వర్గీకరణ చేయాలనీ బాబు పై యుద్ధం ప్రకటించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్ ను ఆహ్వానించి ఆయన సమక్షంలో వైసీపీ గూటికి చేరాలని ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం .హర్షకుమార్ తో పాటుగా జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ,సీనియర్ నేతలు వైసీపీలో చేరతారని వైసీపీ శ్రేణులకు సమాచారమిచ్చినట్లు టాక్ .