తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోపాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పై విమర్శల పర్వం కురిపించారు.. ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలను మారాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఒకటేనని స్పష్టం చేసారు . ప్రస్తుతం రేవంత్ రెడ్డి వెంట ఉన్న నేతలంతా గతంలో టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపించి, సంప్రదించిన వారేనని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ లో అవకాశాలు లేవని తెలుసుకుని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళుతున్నారని, అలాంటి వారితో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో జరగనున్న తరుణంలో ఇప్పుడు తనకు ఏ విధమైన పదవులూ వద్దని, పదవిపై అసలు ఆశ కూడా లేదని అన్నారు.
