సినీ ఇండస్ర్టీ గురించి చాలా మంది నటీమనులు.. చాలా బోల్డ్‌గా. చెప్పేస్తున్నారు. ఇక్కడ మేము వేధింపులు ఎదుర్కొన్నాం అనే మాటను చాలా మంది నటీమణులు చెబుతున్నారు. హీరోల నుంచి.. నిర్మాతల నుంచీ.. దర్శకుల నుంచీ.. ఆఖరకు తోటి నటుల నుంచీ లైంగిక వేధింపులు తప్పలేదని వారు కుండబద్దలు కొడుతున్నారు. హీరోలు తమను పడకింటికి రప్పించుకునేందుకు ప్రయత్నించారని నిర్మాతలూ.. అలాంటి ఒత్తిళ్లు తెచ్చారని వారు ఓపెన్‌గా చెబుతున్నారు. కొంతమంది డైరెక్టుగా పేర్లనే చెబుతుంటే.. మరికొందరు పరోక్షంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తున్నారు.
ఇప్పుడు విద్యా బాలన్ కూడా అలాంటి విషయంలో తన అనుభవాన్ని వివరించింది. ఇండస్ర్టీలో తనపైన ఒత్తిళ్లు తప్పలేదని, విద్యా పరోక్షంగా తేల్చి చెప్పింది. అయితే, వాటిని తిప్పికొట్టానని, వాటి భారినపడకుండా తనను తాను కాపాడుకున్నాననీ తన మధ్య తరగతి మనస్తత్వమే అందుకు సాయపడిందని విద్య వివరించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన విద్యా బాలన్ చిత్ర పరిశ్రమలో వాడుకోవాలని చూసే తత్వం ఉందని ధృవీకరించింది. అయితే, తాను వాటి భారిన పడలేదని అలాంటి ఒత్తిళ్లు ఎదురవుతాయని అనిపించిన సమయంలో తానే వాటికి దూరంగా జరగానని విద్యా బాలన్ వ్యాఖ్యానించింది. తనకు పడని వాతావరణానికి దూరంగా వెళ్లిపోయానని దీంతో వేధింపులు తనను తాకలేక పోయాయని ఆమె వివరించింది. ఈ జాతీయ ఉత్తమ నటి కూడా ఇండస్ర్టీకి క్లీన్ చిట్ ఇవ్వలేదనేది మాత్రం స్పష్టమవుతోంది.
విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు బాలీవుడ్డే కాదు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ తన “డర్టీ పిక్చర్”తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది. అంతేకాదండోయ్.. అవసరమైతే టాప్‌లెస్‌గా కూడా నటిస్తానని చెప్పిందట.
అయితే, విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు బాలీవుడ్డే కాదు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ సిల్క్ స్మిత పుణ్యమా అని తన “డర్టీ పిక్చర్”తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసిన సంగతి తెలిసిందే. అంతేకాదండోయ్.. అవసరమైతే టాప్‌లెస్‌గా కూడా నటిస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చేసింది ఆమె.
దీంతో ఇపుడు బాలీవుడ్ సంగతేమోగానీ కోలీవుడ్, టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నారట. కొందరు అగ్రశ్రేణి దర్శకనిర్మాతలకు విద్యా బాలన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.
మొత్తమ్మీద మన టాలీవుడ్ సిల్క్ స్మిత పుణ్యమా అని విద్యా బాలన్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. సిల్క్ స్మితకు ఇంత క్రేజ్ ఉన్న సంగతి బాలీవుడ్ ఏక్తా పసిగట్టింది కానీ మన టాలీవుడ్ నిర్మాతలు పసిగట్టలేకపోయారు. ప్చ్… ఏం చేస్తాం…!!