బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు తమ వయస్సుకు గ్లామర్‌కు మధ్య ఉన్న తెరను చించేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రక్కన పెళ్ళై పిల్లాడు పుట్టాక బాగా వెయిట్ పెరిగిపోయిన కరీనా కపూర్.. మరో ప్రక్కన 30 దాటేసి పెళ్ళికి రెడీగా ఉన్న సోనమ్ కపూర్.. ఇంకోవైపు తన యాక్టింగ్‌తో బాగా ఆకట్టుకుంటున్న బొద్దు భామ స్వరా భాస్కర్.. వీరు ముగ్గురూ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు.. అదేంటో తెలుసా..
ఈ ముగ్గురు హీరోయిన్ల కలయికలో వెడ్డింగ్ అనే ఒక కొత్త సినిమా వస్తోంది. ఈ సినిమా క్యాస్టింగ్ కాస్త గట్టిగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేముందు.. దానికి సంబంధించిన టీజర్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో కొత్తమ్మాయి షికా తల్సానియాను పక్కనపెడితే.. మన ముగ్గురు స్టారీమణులు మాత్రం ఏదో మాయ చేస్తున్నారు.
ఇక హాట్ బ్యాక్ తో సందడి చేస్తున్న సోనమ్ కపూర్.. ఆమె చేతిలోనే ఫ్యాన్ చాటున దాక్కున్న కరీనా.. అలాగే తన కాలి జూతాను సరిచేసుకుంటూ.. వయ్యారాలను వడ్డిస్తున్న స్వరా భాస్కర్.. అబ్బో లెహంగాల్లో భలే మ్యాజిక్ చేశారు కదూ. అందుకే ఒక్కసారిగా బాలీవుడ్‌లో ఈ పోస్టర్ వైరల్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాలో పెళ్లి ఎలా ఉంటుందో తెలియదు కాని.. ఈ ముగ్గురును చూడ్డానికి మాత్రం జనాలు క్యూలు కట్టేశాలా ఉన్నారంతే. మరి ఫస్ట్ లుక్ వచ్చాక ఈ ముగ్గురిని మరోసారి పలకరిద్దాం.