Home / ANDHRAPRADESH / వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత

వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె ను సైతం పోలీసులు అడ్డుకున్నారు . ఈ లోగా ఎం ఎల్ ఏ తోట త్రిమూర్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి విజయలక్ష్మిని లోపలి తీసుకు వెళ్లారు . మీడియాను అనుమతించడం లేదు . సంఘటన పూర్వాపరాలు ఇలావున్నాయి . జక్కంపూడి రాజా అత్తవారి ఇల్లు ద్రాక్షారామ లో ఉంది . ఈ క్రమంలో ఆదివారం ద్రాక్షారామ ఆలయం లో పూజలు నిర్వహించిన రాజా తన సతీమణి తో కలసి రాజమహేంద్రవరం కారు లో బయలుదేరారు . రామచంద్రపురం మసీద్ సెంటర్ ఖజానా జ్యులరీస్ వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయింది . అక్కడ రోడ్ పనులు జరుగుతుండటం తో ఒకవైపే వాహనాలు వెళుతున్నాయి . ఈ సమయంలో రాజా కారు వెనక్కు వెళ్లాలని , పక్కకు తీయాలని , ఇలా ఒకటికి రెండుసార్లు అక్కడ వున్నా ఎస్ ఐ నాగరాజు అనడం తో అలాగే చేసారు . ఈ లోగా ఇంతకు తనకారును వెళ్లనీయక పోవడం తో రాజా ఎస్ ఐ ని వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయాలనీ కోరారు . దీంతో ఎస్ఐ దురుసుగా మాట్లాడటం తో రాజా కారు కిందకు దిగి తాను జక్కంపూడి రాజా నని చెప్పడం తో ఐతే ఏమిటంటూ ఎసై ఎగతాళి చేయడం తో వాగ్వివాదం చోటుచేసుకుంది . దీంతో ఎస్ ఐ రాజా కాలర్ పట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు . ఇద్దరు కలబడ్డారని అంటున్నారు . ఐతే ఎస్ఐ రెచ్చిపోయి లాఠీ తో కొట్టగా పెదవిపై గాయమైనట్లు చెబుతున్నారు . విషయం తెలుసుకున్న ద్రాక్షారామ లోని రాజా బంధువులు అభిమానులు వై కాపా నాయకులూ కార్యకర్తలు పెద్ద సంఖ్య లో అక్కడికి చేరుకున్నారు . ఈలోగా పోలీసులు రాజాను స్టేషన్ కు తరలించి గదిలో ఉంచారు . జక్కంపూడి విజయలక్ష్మికి సమాచారం చేరడం తో అనుచరులతో కలసి ఆమె స్టేషన్ కు వచ్చారు . స్టేషన్ బైటే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు . లోపలి వెళ్లడం కుదరదని చెప్పారు . ఈ నేపధ్యం లో తోట త్రిమూర్తులు అక్కడికి వచ్చి ఆమెను లోపలి తీసుకు వెళ్లారు . పోలీసులతో చర్చించారు . సమాచారం దవాలంలా వ్యాపించడం తో మరింతమంది కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం గా మారింది . మైన్ రోడ్ పై అనుచరులు ధర్నా కు దిగారు . పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు . కారులో వున్నా రాజా సతీమణి అక్కడే ఉండిపోయారు . అక్కడినుండి కదలనని పట్టుబట్టారు . జిల్లా వై కా పా అధ్యక్షులు కురసాల కన్నా బాబు కూడా అక్కడికి చేరుకున్నారు . ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది .

రెచ్చిపోయిన అభిమానులు ..
టెంట్ల లకు నిప్పు …

రామచంద్రాపురం లో పరిస్థితులు చేయదాటిపోతున్నాయి . అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది . రెచ్చిపోయిన స్టేషన్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏర్పాటుచేసిన షామియానా టెంట్లను దగ్ధం చేసారు . రాజా ను ప్రభుత్వాస్పత్రి కి తీసుకువెళ్లి వైద్యం అందించాలి డిమాండ్ చేస్తున్నారు , ఎసై ను తక్షణం సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు . అప్పటివరకు కదిలేదిలేదని తేల్చిచెప్పారు . కె గంగవరం , ద్రాక్షారామ , మండపేట , ఆలమూరు పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నార

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat