హీరో అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తున్న ఓ కామెడీ షో లో ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొంది. షోలో భాగంగా కంటస్టెంట్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు. షోకు అక్షయ్ కుమార్‌తో పాటు కమెడియన్ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడంతో మల్లికా బెల్‌ను మోగించబోయారు.
ఆమెను వారించబోతూ.. మల్లికా జీ మీరు బెల్ మోగిస్తే.. నేను మీ బాండ్ మోగిస్తాను అంటూ అక్షయ్ వ్యాఖ్యానించారు. దీంతో అక్షయ్ మల్లికను ఉద్దేశించి అభ్యంతరకరంగా కామెంట్ చేశారంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఈ విషయంపై స్పందించాలంటూ పలువురు ట్వింకిల్ ఖన్నాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ట్వింకిల్.. కామెడీ షోలలో ఇలాంటి కామెంట్లు సహజమని ట్విటర్ వేదికగా తెలిపింది.