తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు.
పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.