నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అంటేనే హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి పనిచేసిన సింహా, లెజెండ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మూస ధోరణిలో వెళుతున్న బాలయ్యను.. చాలా భిన్నంగా, చాలా పవర్‌ఫుల్‌గా చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారని సమాచారం. అయితే బాలయ్యతో సినిమా మొదలుపెట్టేలోపల బోయపాటి మరో సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో రామ్‌చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే, నిర్మాత డీవీవీ దానయ్యతో కలిసి సినిమా చేస్తానని చరణ్ ఇప్పటికే మాట ఇచ్చాడు. ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా రానుందని టాక్. ఈ సినిమా తరువాత వచ్చే ఏడాది జులైలోగానీ, ఆగస్టు నుంచి గానీ.. బాలయ్య సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే బాలయ్యకే బాలయ్యకు కథ వినిపించడం.. బాలయ్యను ఒప్పించడం కూడా జరిగిపోయాయట.
అయితే, ఇప్పుడు ఈ కథకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బోయపాటి ఈ సారి బాలయ్యతో మల్టీస్టారర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో బాలయ్యతోపాటు మరో అగ్రహీరోకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో హీరోగా ఎవరిని తీసుకోబోతున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సినిమాను పట్టాలెక్కించడానికి మరికొంత సమయం ఉండటంతో బోయపాటి ఇంకా సెకండ్ హీరోను కన్పామ్ చేయలేదు. ఈ నిర్ణయాన్ని కూడా బాలయ్య ఛాన్స్‌కే బోయపాటి వదిలేసినట్లు సమాచారం.