తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ గా చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు..ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగింది అని మరింత అభివృద్ధి చేయాలని జిల్లా అయిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్నారు..
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావడంతో 22 గ్రామాలు సిద్దిపేట అబివృద్ది సంస్థ లో వస్తాయన్నారు..ఇందులో సిద్దిపేట పట్టణం తో పాటు సిద్దిపేట అర్బన్ లో 9గ్రామాలు…సిద్దిపేట రూరల్ లో 4గ్రామాలు ,కొండపాక లో 2గ్రామాలు ,చిన్నకోడూర్ మండలంలోని 3గ్రామాలు ఈ అబివృద్ది సంస్థ లో కలిసాయన్నారు…
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాడటం తో గ్రామాలు మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి గ్రామాలు కొత్త అందాన్ని సంతరించుకొనున్నాయని…హైద్రబాద్ ,వరంగల్ స్థాయిలో సిద్దిపేట ను అబివృద్ది సంస్థ గా చేస్కువడం చాలా సంతోషంగా ఉంది అన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ఈ అబివృద్ది సంస్త రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు .