మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది.
నైజామ్ లో రవితేజ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత రవితేజ చేసిన ఈ సినిమా, ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ తెచ్చిన ఉత్సాహంతో .. రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నాడు. ఇక తమిళంలో విజయం సాధించిన ‘బోగన్’ సినిమా తెలుగు రీమేక్ లోను చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
ఒకవేళ రూ .169 రీచార్జ్ ఇష్టంలేని వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఏ రీఛార్జ్ ప్లాన్ అయినా వినియోగించుకోవచ్చు. అయితే, రూ .500 మొదటి వాపసును క్లెయిమ్ చేయటానికి, మొదటి 18 నెలల్లో రూ. 3000 విలువ గల రీఛార్జిలు చేసుకోవాలి. అలాగే రూ. 1,000 రిఫండ్ కావాలంటే 18 నెలల్లో రూ. 3000 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 36 నెలలు, మొత్తం రీఛార్జి రూ. 6,000.