తాము నటించే క్యారెక్టర్ కోసం నటీనటులు వర్కవుట్ చేయడం కామన్. కానీ ఈ అమ్మడు తన క్యారెక్టర్ కోసం ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. త్వరలో హిందీ, మలయాళంలో తెరకెక్కబోయే ఓ సినిమా కోసం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ముంబైలోని కామటిపురా వేశ్యావాటికలో పర్యటించి షాక్ ఇచ్చింది. తన చేయబోయే క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ కోసం వేశ్యావాటికలో పర్యటించి అక్కడి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడి మహిళల జీవితాల గురించి చాలా విలువైన సమాచారం తెలుసుకునే అవకాశం దొరికిందని శోభిత తెలిపింది.
మోథూన్ అనే బైలింగ్వల్ చిత్రంలో కామటిపురాలోని రెడ్‌లైట్ ఏరియాలో నివసించే సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తోందట శోభిత. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే ఆమెకు కామటిపురాలో పర్యటించడం వలన సమాజంలోని చాలా అంశాల్ని తెలుసుకునే అవకాశం కలిగిందని.. అలాంటి అవకాశాన్ని కల్పించిన చిత్ర యూనిట్‌కు ఈ ముద్దుగుమ్మ థాంక్స్ చెప్పింది. ఇలాంటి క్యారెక్టర్‌లో నటించడం తన అదృష్టంగా శోభిత పేర్కొంటోంది. గీతా మోహన్‌దాస్ డైరెక్షన్‌లో మోథున్ చిత్రం తెరకెక్కుతోంది