మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు రోజుకో అవతారమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిల్మ్ ఇండస్ర్టీకి సంబంధించిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో జరిగే అన్యాయాలపై ఎంతమందో హీరోయిన్లు నోరు మెదిపినా.. చాలా మంది హీరోయిన్స్ ఆ మాటలను తప్పుబట్టారు. అయితే, నిప్పు లేకుండా పొగ రాదన్న సామెతను ఎవరూ మర్చిపోలేదన్నది మరికొందరి వాదన. ఇదిలా ఉంటే తన జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటన గురించి షేర్ చేసుకుంది ఓ స్టార్ హీరోయిన్. గతంలో తాను లోకల్ ట్రైన్‌లో వెళుతుండగా.. డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తి తనతో చాలా నీచంగా బిహేవ్ చేశాడట.
రహస్య ప్రదేశాలను చేతితో తాకేందుకు ప్రయత్నించాడట. తను వార్నింగ్ ఇవ్వడంతో కొద్ది దూరం వెళ్లి కూర్చున్నాడట. కాస్త ఊపిరి పీల్చుకునేలోపే ఆ యువకుడు తన ఫ్యాంట్ జిప్ తీసి ఆమె చూస్తుండగానే తన అంగాన్ని బయటకు తీసి హస్త ప్రయోగం చేయడం మొదలుపెట్టాడట.
ఆ వికృత చేష్టలు భరించలేకపోయిన.. ఆ హీరోయిన్ తన దగ్గర ఉన్న గొడుగుతో అతనిపై దాడి చేసిందట. కాలర్ పట్టుకుని పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేయగా.. విడిపించుకుని పారిపోయాడట. స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ల విషయంలోనే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉందంటూ ఆ హారోయిన్ తన గత అనుభవాలను పంచుకుంది.