దేశంలో వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. వయస్సుతో పనిలేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డపైనే ఓ దుర్మార్గపు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆమె గర్భవతి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన ఓ తండ్రి, 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కానీ కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యం పాలైంది. ఇంకా శారీరక పరంగా మార్పులు చోటుచేసుకోవడంతో అనుమానంతో బాలిక బాబాయి, చిన్నమ్మలు బాలికను నిలదీశారు. దీంతో జరిగిన వృత్తాంతాన్ని బాలిక వాళ్లకు వెల్లడించింది.
ఈ ఘటనపై బాలిక బాబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పరారిలో ఉన్న బాలిక తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.