తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి టీడీఎల్పీ మాజీ నేత రేవంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు, భారీ ఎత్తును కార్యకర్తలు కాంగ్రెస్ చేరుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనతో వచ్చే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక, తనవెంట వచ్చేవారి జాబితాను కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే పంపించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో సండ్ర, కేటీఆర్ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది అని ఒక వార్త హాల్ చల్ చేస్తుంది .యదాతధంగా మీకోసం ..అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా సంభాషించారు. టీడీపీ వలసల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు ఎక్కడికి వెళుతున్నారు’ అని సండ్రను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
ఇందుకు సమాధానంగా ‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు’ అని సండ్ర వెంకటవీరయ్య మంత్రికి సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డితో పలువురు టీడీపీ నేతలు వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతక్క పార్టీ మారుతారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వారిద్దరూ తమ పార్టీలోనే ఉంటారని ఈ సందర్భంగా సండ్ర స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వెళ్లడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు.