తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండోరోజు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై బీజేపీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా హరితహారంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. .ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ అంశం అత్యవసరం కాబట్టి చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా ప్రశ్నోత్తరాల అనంతరం దానిపై చర్చిద్దామని సభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు తెలిపారు. పట్టువీడని కాంగ్రెస్…వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది.
