Home / SLIDER / కాంగ్రెస్ లోకి రేవంత్..నేడు కుంతియాతో భేటీ

కాంగ్రెస్ లోకి రేవంత్..నేడు కుంతియాతో భేటీ

టీడీపీ పార్టీకి రిజైన చేసిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది.  ఆయన ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే దీనిపై ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్నారు. ఆయనతో  రేవంత్‌రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. కాగా రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే ఆ ముప్పైమంది ఎవరా? అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

శనివారం TDP కి, MLA ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్నారు. నిన్న అమరావతి నుంచి నేరుగా కొడంగల్ వచ్చిన రేవంత్ కు అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఉదయం కొడంగల్లో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో అనుచరులతో మంతనాలు చేయనున్నారు. మధ్యాహ్నం వరకు అనుచరులు, నియోజవర్గ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సాయంత్రానికి హైద్రాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు జలవిహార్లో మరోసారి తనతో కలిసివచ్చే నాయకులతో భేటీ జరుపుతారని సమాచారం. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి.. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరుతారని సమాచారం అందుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat