సౌత్ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటోంది. భారీ లేడి ఓరియెంటెడ్ కి సంబందించి కథలను రాసుకుంటే దర్శకులు ఎక్కువగా స్వీటీని మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు అనుష్క కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఉన్నాయి. బాహుబలితో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
రుద్రమదేవి, బాహుబలి తరువాత అనుష్క చారిత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న భాగమతి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల తరువాత వస్తున్న భాగమతిపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా దర్శకుడు జీ.అశోక్ సిఇమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా విడుదల తేదీ ఆలస్యమవుతోంది. నవంబర్ నాటికి సినిమా తొలి కాపీని సిద్ధం చేసి డిసెంబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 7న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా భాగమతి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారట.
ఈ చారిత్రక సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లో స్వీటీ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని దర్శకుడు భావించారట. కొంతమంది యూనిట్ సభ్యుల ద్వారా ఆ సీక్రెట్ బయటకు వచ్చింది. భాగ్‌మతి టైటిల్‌రోల్‌తోపాటు మరో పాత్రలో అనుష్క నటించిందట. అయితే, ప్రస్తుతానికి ఆ పాత్రను గురించిన వివరాలు బయటకు రాలేదు. అరుధతీ తరహాలో అనుష్క కెరీర్‌లో భాగ్‌మతి నిలిచిపోతుందని టాక్ వస్తోంది. అనుష్కతోపాటు మరో ముఖ్యపాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. ఈ సినిమా ద్వారా మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా తమన్ స్వరాలు సమకూర్చారు.