టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడర్ పూర్తిగా ఢీలా పడింది. తమకు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యకర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌కు రారు. వచ్చినా చుట్టుపు చూపుగానే వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మొన్న తెలుగుదేశం నేతలతో తన ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏదో ఒక కార్యక్రమం జరిగేది. ప్రెస్‌మీట్‌లతో విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆ స్టామినా ఉన్న నేత ఎవరూ కనిపించడం లేదు. రమణకు అంత సీన్ లేదు. మోత్కుపల్లి చంద్రబాబు తాయిలం అందినప్పుడే స్పందించే నేత. ఇక రావులతో పాటు ఇతర నేతలతో కేడర్‌కు టచ్ లేదు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా డల్ అయిపోయారు.దీంతో సోషల్ మీడియాలో కామెంట్స్ తో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ ఇక కనిపించదు అనే మాట విన్పిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను వేరే వాటికి లీజుకు ఇచ్చుకోవడమే బెటర్ అని కామెంట్లు విన్పిస్తున్నాయి. అన్నట్లుగానే భవనంలో కొన్ని గదులను అద్దెకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ ఎఫెక్ట్‌తో ఇక ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌కు టు లెట్ బోర్డు పెట్టుకోవాలని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
Tags coments hyadarabaad ntr trust bhavan revanth reddy social media to -let-board