బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి, యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి సెలబ్రిటీగా మారిపోవడంతోపాటు పలు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. బిగ్‌బాస్‌కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొందరికే తెలిసిపోయిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవల అలీ నిర్వహించే ఓ టాక్ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్‌తో కలిసి పాల్గొన్నది. ఈ సందర్భంగా హరితేజ తన ప్రొఫెషనల్ విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. హరితేజ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. అమ్మ కన్నడ, నాన్న తమిళ్. అమ్మమ్మ మరాఠి. మా ఆయన కన్నడి. అంతా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మా ఇల్లు ఓ మినీ భారతంలా ఉంటుంది. విన్నర్ చిత్రంలో ఆదర్శ్‌తో కలిసి నటించాను. కానీ ఆదర్శ్ నటించాడు అనే విషయం తెలియదు. బిగ్‌బాస్‌లో మాట్లాడుకునే సమయంలో విన్నర్లో నటించామని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. నాది ప్రేమతో కూడిన అరెంజ్డ్ మ్యారేజ్. తొలుత ప్రపోజ్ చేసింది మా ఆయనే. ముందు నాతో పెళ్లి చూపులు జరిగాయి. ఫస్ట్‌లుక్‌లో నాకు నచ్చలేదు. ఆ తర్వాత రెండేళ్లు అతను నా కోసం వేచి చూస్తున్నాడని తెలుసుకొన్నాను. అప్పుడు మళ్లీ కలిశాం. ఆ తర్వాత ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది పెళ్లికి ముందే గోవా ట్రిప్‌కు పెళ్లికి ముందు ఇంట్లో వాళ్లకు తెలియకుండా గోవా ట్రిప్‌కు వెళ్లాం. ఎంగేజ్మెంట్కు రెండు నెలల ముందు పెళ్లి కన్ఫర్మ్ అయిన తర్వాత గోవాకు వెళ్లాం. చిన్నప్పుడు పూలు కొనడానికి వెళ్లినపుడు నన్ను ఒకడు కిడ్నాప్ చేశాడు. వాస్తవానికి ఉదయమే పార్క్ వెళ్లి పూలు కొట్టేయానికి వెళ్లాను. తోటమాలి వెంటపడటంతో నాతో ఉన్నవాళ్లు తలోదారిలో పారిపోయారు. కిడ్నాప్‌కు గురయ్యాను.. అప్పుడు భయపడుతున్న నా వద్దకు ఓ యువకుడు వచ్చి ఏమిటని అడిగాడు. నా ఫ్రెండ్స్ కోసం చూస్తున్నాను అని చెప్పగానే.. గేట్ బయట ఉన్నారు అని చెప్పి నన్ను ఎక్కడికో తీసుకెళ్లి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై చేశాడు. అగంతుకుడిని కొట్టాను ఏదో జరుతుందని ఆందోళనకు గురైన నేను వాడిని బలంగా కొట్టాను. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సంఘటన చాలా గుర్తుండిపోతుంది. ఆ విషయం గుర్తు చేసుకొంటే చాలా భయంగా కూడా అనిపిస్తుంది.