Home / MOVIES / సౌత్ అంత‌కు మించి నేర్పింది.. అక్ష‌య్‌

సౌత్ అంత‌కు మించి నేర్పింది.. అక్ష‌య్‌

ద‌క్షిణాధి సినీ ప‌రిశ్ర‌మ మీద బాలీవుడ్ వాళ్ల ప్ర‌శంస‌లు అంతకంత‌కూ పెరిగిపోతున్నాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ బాహుబ‌లితో అసోసియేట్ అయిన‌ప్ప‌టి నుంచి సౌత్ ఇండ‌స్ర్టీని తెగ పొగిడేస్తున్నాడు. ఈ ఏడాది సౌత్ నుంచి మంచి సినిమాలు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌ముఖ క్రిటిక్ త‌రుణ్ ఆద‌ర్శ్ కూడా బాలీవుడ్ సౌత్ నుంచి పాఠాలు నేర్చుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇప్పుడు సీనియ‌ర్ హీరో అక్ష‌య్‌కుమార్ సైతం సౌత్ ఇండ‌స్ర్టీని ఆకాశానికెత్తేశాడు. బాలీవుడ్ వాళ్లంద‌రూ సౌత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయ‌ప‌డ్డాడు.

తాను ఇప్ప‌టి దాకా 130 సినిమాలు చేశాన‌ని.. వాటితో ఎంత నేర్చుకున్నానో.. ద‌క్షిణాధి సినిమా 2.0 నుంచి అంత నేర్చుకున్నాన‌ని అక్ష‌య్ చెప్ప‌డం విశేషం. సౌత్ సినిమా నుంచి నేర్చుకోవ‌డానికి చాలా ఉంది. ఇక్క‌డివాళ్ల ప‌నితీరు చాలా బాగుంటుంది. ఐక‌మ‌త్యంతో ప‌నిచేస్తారు. ఒక‌రి ట్యాలెంట్‌ను మ‌రొక‌రు గుర్తిస్తారు. ప‌ర‌స్ప‌రం గౌర‌వం ఇచ్చి పుచ్చుకుంటారు. బాలీవుడ్ ఇవ‌న్నీ చూసి చాలానే నేర్చుకోవాలి.

నేను ఇప్ప‌టి దాకా 130 సినిమాలు చేశాను. 2.0 నా 131వ సినిమా ఇప్ప‌టి దాక చేసిన ప్ర‌తీ సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకున్నా కానీ 2.0 విష‌యంలో మాత్రం ఆరంభం నుంచి చివ‌రి దాకా నేర్చ‌కుంటూనే ఉన్నా. ర‌జ‌నీకాంత్ స‌ర్ నిజ‌మైన సూప‌ర్‌స్టార్ ఆయ‌న‌లాంటి దిగ్గ‌జంతో ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించినందుకు శంక‌ర్ స‌ర్‌కు నా ధ‌న్య‌వాదాలు 2.0 లాంటి భారీ సినిమాలో నేను న‌టిస్తాన‌ని ఎన్న‌డూ ఊహించ‌లేదు అని అక్ష‌య్ 2.0 ఆడియో వేడుక‌లో అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat