సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు . తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూట్యూబ్‌లో తన భార్యకు సంబంధించి వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై అతడు కంప్లైంట్ చేశాడు. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా వార్తలతో పాటు, నటీనటులపై గాసిప్స్ రాస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సైట్లు హద్దులు మీరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నటులపై ఊహాజనిత వార్తలు రాయడంతో తమ పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నాయని తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో శివబాలాజీ కూడా ’మా’ కు మద్దతుగా మాట్లాడారు. దీంతో అతడిపై కక్ష కట్టి… దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
