Home / MOVIES / శివబాలజీ భార్యను ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు

శివబాలజీ భార్యను ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు

సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్‌ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమాలో హీరో తమ్ముడి పాత్రలో శివబాలాజీ నటించాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన అతడు.. డబ్బింగ్ పనులను పూర్తి చేశామంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలను పొగుడుతూ చాలా మంది కామెంట్లు పెట్టగా…వాసు అనే యువకుడు మాత్రం అసభ్య పదజాలంతో కామెంట్స్‌ పెట్టాడు. దీంతో ఆ కామెంట్‌తో సహా ఫొటోను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఎందుకు? నాకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ ఈ తిట్ల వల్ల నేను నీమీద కేసు పెట్టొచ్చు తెలుసా?’ అంటూ శివబాలాజీ ఓ లింక్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ యువకుడు మరింత రెచ్చిపోవడంతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయంలోలో శివబాలాజీ ఫిర్యాదు చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat