న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ 75 పరుగులతో క్రీజులో ఉన్నారు.
