తెలుగుజాతిని నడిపిస్తున్నాని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం స్నానం చేయడాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 10 రోజులు పాటు విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ విశేషాలను మీడియాకు వివరించారు. విదేశీ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులను తాను ఆకర్శించానన్నారు. వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు అమెరికా పర్యటన ఊతం ఇచ్చిందన్నారు. రైతుల ఇంట నిత్య దీపావళి ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు.
విదేశీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కోసం తాను ఎంతగా తపించానో చెప్పేందుకు చంద్రబాబు కొన్నిఉదాహరణలు చెప్పారు. 9 రోజుల పాటు విశ్రాంతి లేకుండా తాను పర్యటన చేశానన్నారు. విమానంలోనే నిద్రపోయానన్నారు. విమానంలోనే ముఖం కడుక్కున్నానని వివరించారు. విమానంలోనే స్నానం చేశానన్నారు. విదేశీ పర్యటన సమయంలో కొన్ని రోజులు తాను స్నానం కూడా చేయలేదని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రం కోసమే తాను స్నానం కూడా చేయకుండా బిజీగా పర్యటనలు సాగించానన్నారు చంద్రబాబు. తాను పడుతున్న శ్రమను వివరించేందుకు చంద్రబాబు మీడియా సమావేశంలో ఈ విషయాలు చెప్పారు.