కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు రెండో మ్యాచ్‌లో కలసికట్టుగా రాణించడం కోహ్లి సేనకు కలిసి వచ్చే అంశం. టీమిండియా తొలి వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (14; 20 బంతుల్లో 3×4) ఔటయ్యాడు. టిమ్ సౌథీ వేసిన 6.1వ బంతిని భారీ షాట్ ఆడాడు. మిడాఫ్‌లో గాల్లోకి లేచిన బంతిని కివీస్ సారథి కేన్ విలియమ్సన్ చక్కగా ఒడిసిపట్టాడు. పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 53/1తో ఉంది. రోహిత్ శర్మ (27; 29 బంతుల్లో 3×4, 1×6), విరాట్ కోహ్లీ (10; 11 బంతుల్లో 2×4) ధాటిగా ఆడుతున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్.
న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్టిల్, మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్.