ఇటీవల స్మాల్ స్ర్కీన్‌పై ప్రదీప్ స్టారయ్యాడు. కొద్దికాలంగా బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తున్నాడు. అతడికి పెద్ద హీరోలకు ఉన్న ఫాలోయింగ్ యూత్‌లో ఉంది. ఎందోలో అయినా ఇమిడి పోగలడు. అతను చేస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షోకి ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్ సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ షో ప్రదీప్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ షోనే కాకుండా ఎన్నో రియాల్టీ షోలు, యాంకరింగ్‌లు చేస్తున్న ప్రదీప్ ఒక నెల సంపాదన ఎంతో తెలుసా.. బుల్లితెర సమాచారం ప్రకారం ప్రదీప్ ఒక్క నెలకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నాడట.
అలాంటి ప్రదీప్‌కు ఇంకా పెళ్లి కాలేదు. మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్. ప్రదీప్‌కి పిల్లను ఇవ్వడానికి ఎంతో మంది క్యూ కడుతున్నారు. తను చేసే షోస్‌లలో కూడా తన పెళ్లి గురించి తానే సెటర్‌లు వేసుకుని మంచి కామెడీ పండిస్తాడు. నేను పెళ్లికి రెడీ కానీ.. నాకు అమ్మాయిలు దొరకడం లేదు. కొందరైతే తనను వద్దంటున్నారని తనమీద తనే జోకులేసుకుంటాడు. తన షోస్ ఎక్కువశాతం అమ్మాయిలే చూస్తారట. అందుకే బుల్లితెరపై అత్యంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ప్రదీప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాను క్షణం తీరక లేకుండా లెక్కలేనన్ని షోస్ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక సినిమాల్లోనూ అక్కడక్కడా కనిపిస్తున్నాడు. ప్రదీప్ కుటుంబ సభ్యులు అతనికి మ్యారేజ్ చేయాలని నిర్ణయించారట. తన యాటిట్యూడ్‌కి బాగా సెట్ అయ్యే అమ్మాయి కోసం వెతుకుతున్నారట. ఇటీవలె వైజాగ్ నుంచి ప్రముఖ రాయాల్టీ వ్యాపార వేత్త ప్రదీప్‌కు తన కూతుర్ని ఇచ్చేందుకు అడిగారని ఇండస్ర్టీ టాక్. ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్ చేస్తున్న తన కూతుర్ని ప్రదీప్ పెళ్లి చేసుకుంటే 5 కోట్లు కట్నంగాను..వైజాగ్‌లో మంచి ప్లేస్‌లో ఉన్న రెండు ఖరీదైన ప్లాట్స్‌ను ప్రదీప్ తల్లిదండ్రులకు ప్రపోజ్ చేసినట్లు టాలీవుడ్ సమాచారం.
ప్రదీప్ అంటే తన కూతురికి ఇష్టమని. అందుకే అంతకట్నం ఇచ్చేందుకు కూడా రెడీ అని ప్రదీప్ తల్లిదండ్రులకు వ్యాపార వేత్త వివరించాడు. కానీ ఆశ్చర్యమేమిటంటే ప్రదీప్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని ఆ ప్రపోజల్‌ను పక్కన పెట్టాడట. పెళ్లి చేసుకోవాలని అనుకునే ప్రదీప్ అంత మంచి ఆఫర్‌ని ఎందుకు వద్దన్నాడని బుల్లితెర వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ప్రదీప్‌కి నచ్చలేదేమో. అందంగా లేదేమో. కురిపిగా ఉందేమోనని కొందరంటున్నారు. కానీ, మరికొందరు మాత్రం ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూసిన ఏ సంబంధానికీ ఓకే చెప్పడం లేదని అంటున్నారు. హీరో రేంజ్‌లో పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ యాంకర్ గురించి రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.