తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ దళంలో చేరుతున్నారు. తాజాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పెద్రిపాడు ఎంపీటీసీ కె.శ్రీనివాస్, కొమ్మూరు ఎంపీటీసీ తాళ్ల వెంకటమ్మ, మన్ననూర్ ఎంపీటీసీ రాములమ్మ, నందిపాడు సర్పంచ్ ముద్దమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ సుక్కమ్మ, పెద్దిపాడు మాజీ సర్పంచ్ రాజయ్య, నందిపాడు మాజీ ఉపసర్పంచ్ నెమలి మొగులప్ప, మాజీ ఎంపీటీసీ బాబు, తిమ్మారెడ్డిపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు మొగులయ్య, దుప్పటిగట్టు గ్రామకమిటీ అధ్యక్షుడు పురుషోత్తం, దుప్పటిగట్టు మాజీ ఉపసర్పంచ్ హనుమంతు, వార్డు సభ్యులు గుర్రం మహిపాల్‌తో పాటు 100 మంది కార్యకర్తలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, టిఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.