ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై లవకుశ`. ఈ సినిమా తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చేయడం వెనక.. ఓ టాప్ సీక్రెట్‌ని తారక్ చాలా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు.
వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించినప్పుడు నటించాలా? వద్దా? అనే డైలెమ్మాలో ఉన్నానని.. అయితే నటించాల్సిందిగా ఓ ఇద్దరు ప్రోత్సహించడం వల్లనే నటించానని తెలిపారు. అయితే ఆ పేర్లేమిటో ఇంకా రివీల్ చేయనని అప్పట్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తారక్ అన్నారు. మొత్తానికి ఆ టైమ్ ఇప్పటికి వచ్చింది. తాజాగా ఆ రెండు పేర్లను వెల్లడించారు తారక్. ఆ ఇద్దరు ఎవరు? అంటే ఒకరు ఎస్.ఎస్.రాజమౌళి, ఇంకొకరు కొరటాల శివ. ఆ ఇరువురు స్టార్ డైరెక్టర్లు తారక్‌కి అత్యంత సన్నిహితులు. కోన వెంకట్‌తో కలిసి ఆ ఇద్దరూ స్క్రిప్ట్ వర్క్ చేశారుట. అవసరం మేర సలహాలు- సూచనలు అందించారుట. ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికి ఆ రెండు పేర్లను లీక్ చేశారు తారక్. రాజమౌళి, కొరటాల తారక్ చక్కని బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.