తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ మరోసారి సత్తా చాటాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 40వ ర్యాంకర్ కెంటా నిషిమోటో(జపాన్)ను శ్రీకాంత్ ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై కిదాంబి పైచేయి సాధిస్తూ వచ్చాడు. వరుసగా రెండు సెట్లలో 21-14, 21-13 తేడాతో విజయ కేతనం ఎగురవేశాడు. గత వారం డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న శ్రీకాంత్.. వరుసగా రెండో టైటిల్ సాధించడం విశేషం. ఈ ఏడాదిలో శ్రీకాంత్‌కు ఇది నాలుగో టైటిల్.
