Home / ANDHRAPRADESH / టీడీపీ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

టీడీపీ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

ఏపీ అధికార ప‌క్షం టీడీపీ తెలంగాణ‌లో చేతులెత్తేసినట్లేన‌ని అక్క‌డ టీడీపీ దాదాపుగా లేన‌ట్లేన‌ని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ బలంగా ఉండటంతో దాన్ని వీక్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదు. 15 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలిచి 12 మంది పార్టీ వీడి వెళ్లిపోతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు చంద్రబాబు తొంగి కూడా చూడలేదు. అదే సమయంలో తెలంగాణ పార్టీ బాధ్యతలను యువనేత లోకేష్ చూసుకునే వారు. కాని ఆరు నెలల క్రితం లోకేష్ మంత్రి కావడంతో ఇక తెలంగాణ టీడీపీకి రేవంత్ రెడ్డి దిక్కయ్యారు.

రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ఉన్న నేత అని పార్టీలో గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే వారు. రేవంత్ మంచి మాటకారి కూడా. పంచ్ డైలాగులతో ప్రజలను ఆకట్టుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి చేతుల్లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో కొన్నిసీట్లయినా సాధిస్తుందని భావించారు. టీడీపీకి పట్టున్న కొన్ని జిల్లాల్లోనైనా మంచి నేతలను ఎంపిక చేసి వారికి ఆర్థికసాయం కూడా చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చినట్లు టీటీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు కూడా పార్టీని పూర్తిగా రేవంత్ చేతుల్లోనే పెట్టేశారు. రేవంత్ బాధ్యతలను చేపట్టాక అధికార పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. న్యాయపోరాటాలు చేశారు. అసెంబ్లీలో మైకు అందుకోగానే విమర్శలు వర్షం కురిపిస్తుండటంతో సస్పెన్షన్ కు అనేకసార్లు గురయ్యారు.

అలా రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో మాస్ లీడర్ గా ఎదిగారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే రేవంత్ రెడ్డి ప్రస్థానం టీడీపీలో ముగిసినట్లే. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేతలకు పార్టీ ని డ్రైవ్ చేయగల సామర్థ్యం ఎవరికీ లేదని అందరికీ తెలిసిందే. ప్రతినిర్ణయాన్ని చంద్రబాబు అనుమతి తీసుకుని, ఆయన సలహాల ప్రకారం చేసే వారే. ఉన్న వారిలో కొద్దోగొప్పో మోత్కుపల్లి నరసింహులు ఒక్కరే ఒక లీడర్ గా చెప్పుకోవచ్చు. అయితే ఆయన వల్ల పార్టీకి కొంతైనా ప్రయోజనం చేకూరుతుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లోనే లేదు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి లీడర్ కరువయినట్లే చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఎవరిని ఆ స్థానంలో నియమించినా రేవంత్ స్థానం భర్తీ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి వెంట మరికొందరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat