సూపర్‌స్టార్ రజనీకాంత్.. దాదాపు సినిమా అభిమానులంతా ఆయన అభిమానులే. భాషతో సంబంధం లేకుండా అందరి మనస్సుల్లో చోటు సంపాదించుకున్నారు భాషా. ఇక రజనీ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరూ ఆయన స్టైల్‌ని ఫాలో అయ్యేవాళ్లే. ఇప్పుడు తమన్నా కూడా రజనీ గెటప్ వేసింది.
రోబోలో చిట్టి రజనీలా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ లిప్సిన్ బ్యాటిల్ అనే అనే టీవీ షోకి హోస్ట్‌గా చేస్తున్నారు. సెలబ్రెటీలు ఈ షోలో పాల్గొని ఇతర సెలబ్రెటీల గెటప్‌లో వారిని అనుకరించడమే ఈ షో యొక్క కాన్సెప్ట్. తాజాగా ఈ షోలో తమన్నా పాల్గొంది. ఈ సందర్భంగా ఫరా తమన్నా చేత రజనీ రోబో గెటప్ వేయించింది. రజనీ గెటప్‌లో ఉన్న తమన్న తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాకు చిన్నప్పట్నుంచి స్ఫూర్తిగా నిలిచిన రజనీకాంత్‌కి ఇది నా ట్రిబ్యూట్ అంటూ పోస్ట్ చేసింది తమన్నా.