తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే ఆయన తన లేఖను చంద్రబాబుకు అందజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకూ రాజీనామా చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడకు టీటీడీపీ నేతలు వచ్చారు.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపిన దుమారానికి అమరావతి లో పంచాయితీకి ఫుల్ స్టాప్ చెప్పారు. ముఖ్యమైన టీ-టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్న చంద్రబాబు, రేవంత్ విషయంపైన కూడా చర్చించారు. అందరి నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తర్వాత విడివిడిగా మాట్లాడతానని చెప్పి మీడియా సమావేశానికి వచ్చారు. అయితే చంద్రబాబు మీడియా సమావేశంలో ఉండగానే రేవంత్ రెడ్డి చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను ఇచ్చి విజయవాడ నుంచి బయలుదేరారని సమాచారం. ఇకపోతే నవంబరు 9వ తేదీన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.