కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి…కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంటనే స్పందించారు. మిత్రపక్ష అధినేత అయిన చంద్రబాబు నాయుడికి వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని, కాంగ్రెస్‌లో చేరకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేశారు.తెలంగాణలో పొత్తుల గురించి వివరంగా మాట్లాడుకుందామని చెప్పారని సమాచారం.