Home / MOVIES / ర‌వితేజ‌పై రామ్ షాకింగ్ కామెంట్‌!

ర‌వితేజ‌పై రామ్ షాకింగ్ కామెంట్‌!

ఒక క‌థ ఎవ‌రి ద‌గ్గ‌ర‌కో వెళ్తుంది. కానీ.. చివ‌రికి ఇంకెవ‌రో హీరోగా తెర‌కెక్కుతుంది. అలా తారుమారైన సినిమా రాజా ది గ్రేట్‌. ఈ క‌థ ముందు యువ‌క‌థా నాయ‌కుడు రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. అయితే నేను శైల‌జ‌తో హిట్ కొట్టి ఊపు మీద ఉన్న రామ్ ఈ సినిమా చేసేందుకు ఎక్క‌వ పారితోష‌కం అడ‌గ‌డంతో దిల్‌రాజు అత‌డిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి అప్ప‌ట్లో. ఆ త‌రువాత ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి కూడా రాజా ది గ్రేట్ క‌థ వెళ్లింద‌ట అయితే అత‌డితోనూ వ‌ర్క‌వుట్ కాలేదు. చివ‌రికి ర‌వితేజ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కింది.

టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్న‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా మంచి ఫ‌లితాన్నే అందుకుంది. మ‌రి ఈ సినిమాను మిస్సైనందుకు రామ్ ఎలా ఫీల‌వుతున్నాడిప్పుడు ఈ ప్ర‌శ్నే అత‌ని ముందు ఉంచితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా చేయ‌లేక పోయాను. కానీ అన్నీ అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌వు క‌దా! అలా ఆ ప్రాజెక్టు కుద‌ర‌లేదు అంటూ మీడియాకు చెప్పుకొచ్చాడు రామ్‌. అయితే, ఒక సినిమా చేయ‌లేకపోయాన‌ని బాధప‌డే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే ఒక‌సారి కాద‌నుకున్నాక దాని గురించి అస్స‌లు ఆలోచించ‌ను. అన్నీ ఆలోచించాకే క‌థ‌ను రిజెక్ట్ చేస్తాను కాబ‌ట్టి రిగ్రెట్స్ ఏమీ ఉండ‌వ‌ని రామ్ అన్నాడు.

ఇక త‌న కొత్త సినిమా ఉన్నది ఒక‌టే జింద‌గీ గురించి రామ్ మాట్లాడుతూ.. హైప‌ర్ త‌రువాత ఏదైనా డిఫ‌రెంట్ స్టోరీ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో ఈ క‌థ విన్నా.. విన‌గానే వెంట‌నే ఒప్పుకున్నా.. ప్ర‌ధానంగా స్నేహం మీద న‌డిచే క‌థ ఇది. సినిమాలో అదే కీల‌క‌మైన పాయింట్. మ‌ధ్య‌లో ల‌వ్‌స్టోరీ యాడ్ అవుతుంది. బాల్యం, య‌వ్వ‌నం, మెచ్యూర్డ్ ఏజ్ ఇలా మూడు ద‌శ‌ల్లో క‌థ సాగుతుంద‌ని రామ్ చెప్పాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat