మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అసత్యం పలికాడని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తినడం మానేశానని గతంలో ఓ సభలో పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యను ఎవరో వీడియో ఎడిట్ లో కామెడి చేశారు. చాలా సినిమాల్లో క్లిపింగ్ లను జోడించి కించపరిచే విధంగా ఈ వీడియోను తయారు చేశారు. అయితే వీడియోతో పాటు.. ఇది సత్యాన్ని అపవిత్రం చేయడమేనని, ఇది విన్న వారి రియాక్షన్ ఇలా ఉందని చెబుతూ కామెంట్ కూడా పెట్టాడు.
This is a desecration of truth in a most lie telling emotional angst of the receivers agony
Posted by RGV on Friday, 27 October 2017